Monday, July 13, 2015

గోదావరి పుష్కర శుభాభినందనలు

మితృలందరికీ
గోదావరి పుష్కరాల శుభాభినందనలు

మీ బంధు,మితృలకు తెలుగు గ్రీటింగ్స్ ద్వారా
పుష్కర శుభాకాంక్షలు అందించండి.

"తెలుగు గ్రీటింగ్స్"

Friday, May 15, 2015

తెలుగు గ్రీటింగ్స్- నూతన ఆకృతి


తెలుగు గ్రీటింగ్స్
(తెలుగు భాష, సంస్కృతులకు ప్రతిబింబాలు)
సరికొత్త ఆకృతి సంతరించుకొని వేయికి పైగా గ్రీటింగ్స్ తో మీ ముందుకు వచ్చింది
ప్రతీ సందర్భానికీ, మీరు మీ బంధు, మితృలకు శుభాకాంక్షలు పంపే సదుపాయంతో
తెలుగుదనం ఉట్టిపడేలా తీర్చి దిద్దబడింది. ఫ్లాష్ కార్డులు, యానిమేషన్ కార్డులు, పోస్టు కార్డులు
తియ్యని తెలుగులో మీ అభిమానులకు పంపండి. అందులోని ఆనందాన్ని పొందండి. మాధుర్యాన్ని ఆస్వాదించండి.
మరొక ముఖ్యవిషయమేమిటంటే, ఇది "యూనికోడ్" తో రూపొందించబడింది.
www.telugugreetings.net
ని సందర్శించండి. అనురాగ, వాత్సల్యాలను పెంపొందించే శుభాకాంక్షలు పంపండి.
మీ సూచనలు సలహాలు "అభిప్రాయవేదిక" ద్వారా తెలియజేయండి.
శుభాకాంక్షలతో
దూర్వాసుల పద్మనాభం
(తెలుగు గ్రీటింగ్స్)

Saturday, May 9, 2015

తెలుగు గ్రీటింగ్స్ - తెలుగు వెలుగు సమీక్ష

తెలుగు గ్రీటింగ్స్
www.telugugreetings.net  గురించి
 "తెలుగు వెలుగు" (ఈ నాడు)  మే  నెల  సంచికలో  ప్రచురింపబడిన సమీక్ష చూడండి:
http://telugugreetings.net/reviews/telugu%20velugu.pdf

www.telugugreetings.net
ఎన్నో మార్పులతో కొత్త "సాఫ్ట్ వేర్" తో రూపొందించ బడింది.
మీ అభిప్రాయాలు తెలియజేయండి.   
- దూర్వాసుల పద్మనాభం 

Sunday, December 28, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు భాషాభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు


సందర్శించండి:
మీ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తియ్యని తెలుగులో పంపండి.

Thursday, March 27, 2014

జయ ఉగాది శుభాకాంక్షలు

ఈ నెల 31 జయ నామ సంవత్సర ఉగాది
ఈ జయ సంవత్సరం మీ అందరికీ సుఖ శాంతులను  ప్రసాదించాలని కోరుకుంటున్నా.
మీ అభిమానులకు 
నుండి  తెలుగులో  ఉగాది శుభాకాంక్షలు  పంపండి. 



దూర్వాసుల పద్మనాభం


Friday, October 25, 2013

దీపావళి శుభాకాంక్షలు - Diwali greetings

www.telugugreetings.net

దీపవళి - నవంబరు 3, ఆదివారం 

సందర్శించండి : www.telugugreetings.net

 మీ శ్రేయోభిలాషులకు తియ్యని తెలుగులో దీపావళి శుభాకాంక్షలు పంపండి

Saturday, May 11, 2013

మాతృదినోత్సవం - మే 12, ఆదివారం

ప్రేమకు మారుపేరు అమ్మ. అమ్మ అందమైన అనుబంధం.అంతేలేని అనురాగం.మరపురాని మధుర జ్ఞాపకం. మాతృదినోత్సవం సందర్భంగా, అమ్మ మనసు విశదీకరించే ఎన్నో "గ్రీటింగ్స్" "తెలుగు గ్రీటింగ్స్" www.telugugreetings.net అందిస్తోంది


Sunday, April 7, 2013

 
నమస్కారం
ఈ నెల 11 న విజయ సంవత్సర ఉగాది. తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు గ్రీటింగ్స్ ఆరు వత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ ఏట అడుగిడుతున్న శుభ సమయం. ఈ "విజయ" సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖ, సౌఖ్యాలను తేవాలని మీరు తలపెట్టిన కార్యములు విజయవంతం కావాలని "తెలుగు గ్రీటింగ్స్" తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. విజయ ఉగాదిని పురస్కరించుకొని తెలుగు గ్రీటింగ్స్ మీ కోసం ఎన్నో గ్రీటింగ్స్ ని తియ్యని తెలుగులో తెలుగు సంస్కృతిని ప్రతిబింబిచేటట్టుగా మీముందుకు తెచ్చింది.
ఫేస్ బుక్ లో ఆతికించటానికి వీలుగా ఉగాది తెలుగు స్క్రాప్స్ కూడా మీరు వినియోగించుకోవచ్చు. పుర్వంలాగానే ఇవి కూడా మీకు నచ్చుతాయని నా దృడ విశ్వాసం.
ఉగాది తెలుగు గ్రీటింగ్స్: 
 http://telugugreetings.net/ugadi.htm
ఉగాది తెలుగు స్క్రాప్స్:
 http://teluguscraps.telugugreetings.net/teluguscraps-ugadi.htm

 మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజెయ్యండి.
 - దూర్వాసుల పద్మనాభం
 www.telugugreetings.net
 Email: telugugreetings@gmail.com

Tuesday, October 23, 2012

విజయదశమి శుభాకాంక్షలు


తెలుగు భాషాభిమనులకు విజయదశమి శుభాకాంక్షలు.

"తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృ భాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరచిపోకురా"

సుమారు ఆరు సంవత్సరాల క్రితం తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించే తియ్యని తెలుగులో శుభాకాంక్షలు పంపే సదుపాయం కలిగించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన
www.telugugreetings.net
సైటుకు తెలుగు భాషాభిమనుల ప్రోత్సాహం ఎంతగానో లభించింది. 
తెలుగులో తమవారికి శుభాకాంక్షలు పంపాలని కోరికునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఇది  సంతోషించాల్సిన విషయం.
"తెలుగు గ్రీటింగ్స్" ఎడల ఈ  అభిమానం కొనసాగాలని,
శ్రేయోభిలాషుల సూచనలు సలహాలతో  "తెలుగు గ్రీటింగ్స్" ని మరింత ఉపయుక్తంగా తీర్చిదిద్దాలని నా అభిలాష.
విజయదశమి సందర్భంగా తెలుగువారికి "తెలుగు గ్రీటింగ్స్" తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నా.

- దూర్వాసుల పద్మనాభం
telugugreetings@gmail.com

 

Saturday, December 31, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2012



తెలుగు భాషాభిమానులకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీకు నూతన సంవత్సరం సుఖ శాంతులను ప్రసాదించాలని కోరుకుంటున్నా
ఈ సందర్భంగా " తెలుగు గ్రీటింగ్స్ " www.telugugreetings.net
నుండి తియ్యని తెలుగులో మీ శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు పంపండి


- దూర్వాసుల పద్మనాభం

Tuesday, November 29, 2011

ఆంధ్రజ్యోతి లో "తెలుగు గ్రీటింగ్స్"


ఆంధ్రజ్యోతి 22-11-2011 నాటి దినపత్రికలో "నవ్య" శీర్షికలో
"తెలుగు గ్రీటింగ్స్" వెబ్ సైటు
www.telugugreetings.net

గురించి ఇంటర్వూ ప్రచురించబడింది
ఆ వివరాలు క్రింది లింకులో చూడవచ్చు,
<ఆంధ్ర జ్యోతిలో "తెలుగు గ్రీటింగ్స్" రివ్యూ>
- దూర్వాసుల పద్మనాభం

Saturday, October 30, 2010

తెలుగు గ్రీటింగ్స్ - దీపావళి శుభాకాంక్షలు

లక్శ్మీదేవి కటాక్షము, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరికీ సుఖ, శాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ తెలుగు గ్రీటింగ్స్ దీపావళి శుభాకాంక్షలు అందిస్తోంది .దీపావళి శుభాకాంక్షలకోసం తెలుగు గ్రీటింగ్స్ ఒక ప్రత్యేక సైటు రూపొందించి సమర్పిస్తోంది
http://www.deepavali.telugugreetings.net/

లేదా దీనిని తెలుగు గ్రీటింగ్స్ సైటు నుండి కూడా చేరుకోవచ్చు.
http://www.telugugreetings.net/

తియ్యని తెలుగులో శుభాకాంక్షలు పంపి ఆ ఆనందాన్ని మీ బంధు, మితృలతో పంచుకోండి.మీకు శుభమగు గాక

- దూర్వాసుల పద్మనాభం



Tuesday, August 10, 2010

ఆగస్టు 15 - భారత స్వాతంత్ర దినోత్సవం


భారత స్వాతంత్ర దిన శుభాకాంక్షలు
ఎందరో మహానుభావుల త్యాగ ఫలం మన ఈ స్వతంత్ర భారతం
ఎందరో వీర జవానులు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి
కాపాడుతున్నారు మన ఈ స్వతంత్ర భారతాన్ని.
ఆ దేశభక్తుల త్యాగాలను స్మరించుకుందాం. వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం.

ఈ శుభ సందర్భంగా "తెలుగు గ్రీటింగ్స్" అందిస్తోంది తియ్యని తెలుగులో శుభాకాంక్షలు.
సందర్శించండి:
http://telugugreetings.net

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో.....

- దూర్వాసుల పద్మనాభం

Thursday, July 22, 2010

గురు పూర్ణిమ



గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ.
హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.
ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
ఆదిగురువు వేదవ్యాసులవారు పుట్టినరోజే గురుపూర్ణిమ.
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు.
అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు.
వేదవిభజన చేసిన మహానుభావుడాయన.
ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి.
భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.
తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"అంటారు.
గురువు విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం,ఆరాధించడం హిందూ సంప్రదాయం.
ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.
గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.
గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా చెప్పబడింది .
గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ.
భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది.
తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ,
ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము.

ఈ విశిష్ట పర్వదిన సందర్భంగా మీ శ్రేయోభిలాషులకు తియ్యని తెలుగులో
తెలుగుగ్రీటింగ్స్.నెట్ ద్వారా శుభాకాంక్షలు పంపండి.

తెలుగులో శుభాకాంక్షలు పంపండి
అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించండి

సందర్శించండి: http://www.telugugreetings.net
గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

Wednesday, February 3, 2010

సాక్షి దిన పత్రికలో తెలుగ్ గ్రీటింగ్స్ పై సమీక్ష


సాక్షి దిన పత్రికలో తెలుగ్ గ్రీటింగ్స్ పై సమీక్ష
16-01-2010 సాక్షి దిన పత్రికలో తెలుగు గ్రీటింగ్స్ సైటుపై సమీక్షా వ్యాసం ప్రచురించ బడింది.

దానిని క్రింద లింకులలో కూడా చూడవచ్చును:
http://epaper.sakshi.com/Details.aspx?id=356879&boxid=28598246

లేదా
www.telugugreetings.net/topics/sakshi-review.mht

Tuesday, February 2, 2010

స్వంత గూటికి చేరిన తెలుగు గ్రీటింగ్స్

ఇంత కాలం సబ్ డిమైనులో ఉన్న తెలుగు గ్రీటింగ్స్ సైటు స్వంత గూటికి చేరి నెల రోజులు దాటింది.
కొత్త డొమైను:
http://www.telugu greetings.net

శ్రేయోభిలాషులు ఇది గమనించ ప్రార్ధన.
అంతేకాదు. ఇప్పుడు అన్ని పేజీలు ఫ్లాష్ లోకి మార్చ బడినాయి.
ఈ మార్పులను గమనించి మీ సూచనలు, సలహాలు పంపాలని కోరుకుంటున్నా.

- దూర్వసుల పద్మనాభం
ఇమెయిలు: telugugreetings@gmail.com