Showing posts with label vijayadasami. Show all posts
Showing posts with label vijayadasami. Show all posts

Tuesday, October 23, 2012

విజయదశమి శుభాకాంక్షలు


తెలుగు భాషాభిమనులకు విజయదశమి శుభాకాంక్షలు.

"తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృ భాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరచిపోకురా"

సుమారు ఆరు సంవత్సరాల క్రితం తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించే తియ్యని తెలుగులో శుభాకాంక్షలు పంపే సదుపాయం కలిగించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన
www.telugugreetings.net
సైటుకు తెలుగు భాషాభిమనుల ప్రోత్సాహం ఎంతగానో లభించింది. 
తెలుగులో తమవారికి శుభాకాంక్షలు పంపాలని కోరికునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఇది  సంతోషించాల్సిన విషయం.
"తెలుగు గ్రీటింగ్స్" ఎడల ఈ  అభిమానం కొనసాగాలని,
శ్రేయోభిలాషుల సూచనలు సలహాలతో  "తెలుగు గ్రీటింగ్స్" ని మరింత ఉపయుక్తంగా తీర్చిదిద్దాలని నా అభిలాష.
విజయదశమి సందర్భంగా తెలుగువారికి "తెలుగు గ్రీటింగ్స్" తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నా.

- దూర్వాసుల పద్మనాభం
telugugreetings@gmail.com