గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ.హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.ఆదిగురువు వేదవ్యాసులవారు పుట్టినరోజే గురుపూర్ణిమ.నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు.అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు.వేదవిభజన చేసిన మహానుభావుడాయన.ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి.భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. "గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవే నమః"అంటారు.గురువు విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం,ఆరాధించడం హిందూ సంప్రదాయం.ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది.గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.గురువు అనేది మార్గదర్శి అన్న అర్ధం వచ్చే విధంగా చెప్పబడింది .గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ.భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది.తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ,ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. ఈ విశిష్ట పర్వదిన సందర్భంగా మీ శ్రేయోభిలాషులకు తియ్యని తెలుగులోతెలుగుగ్రీటింగ్స్.నెట్ ద్వారా శుభాకాంక్షలు పంపండి.తెలుగులో శుభాకాంక్షలు పంపండిఅందులోని మాధుర్యాన్ని ఆస్వాదించండిసందర్శించండి: http://www.telugugreetings.netగురు పూర్ణిమ శుభాకాంక్షలు.