తెలుగువారి సంస్కృతి, అలవాట్లు ప్రటిబింబించాలన్న ఉద్దేశంతో మూడేళ్ళ క్రిందట ప్రారంభీంచిన 'తెలుగు గ్రీటింగ్స్' వెబ్ సైట్, సహృదయుల ఆదరాభిమానాలు పొందటం నాలో ఎంతో ఊత్సాహం నింపింది. హైదరాబాద్ e-తెలుగు సభ్యులతో అనుబంధం ఏర్పడటం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. తెలుగు భాషాభిమానులైన మీ సహాయ, సహకారాలతో "తెలుగు గ్రీటింగ్స్" ని మరింత తీర్చిదిద్దగలనన్న ఆశ కలుగుతోంది.
సహృదయంతో మీరు అందించే సూచనలను, సలహాలను సదా ఆహ్వానిస్తాను.
విజయదశమి మీ అందరికీ శుభకరం, ఆనందకరం కావాలని ఆకాంక్షిస్తూ.....
సహృదయంతో మీరు అందించే సూచనలను, సలహాలను సదా ఆహ్వానిస్తాను.
విజయదశమి మీ అందరికీ శుభకరం, ఆనందకరం కావాలని ఆకాంక్షిస్తూ.....
8 comments:
చాలా చాలా బాగుంది...మీక్కూడా విజయ దశమి శుభాకాంక్షలు..!
Padmanabham gaaaru, meeru blog start cheyatam happy ga undi.
-Nallamothu Sridhar
COMPUTER ERA
స్వాగతం పద్మనాభంగారు,
మీ సైట్లోని గ్రీటింగ్స్ నేను ఎన్నోసార్లు మా స్నేహితులకు పంపా. కాని ఆ ఫ్లాష్ గ్రీటింగ్స్ బ్లాగులో పెట్టడం వీలవుతుందా. ఒకేసారి అందరికీ చెప్పడానికి.
కేసరి,సుధాకర్ గారికి
మీ సహృదయతకు క్రుతజ్ఞతలు
జ్యొతిగారూ
క్రుతజ్ఞతలు.
మీ సలహా బాగుంది
వీలుచూసుకొని తప్పక ప్రయత్నిస్తాను
నమస్కారం పద్మనాభంగారు , మీబ్లాగు చాలా బాగుంది. మీకు కూడ విజయదశమి శుభాకాంక్షలు. .... వర్మ.
వర్మగారికి నమస్కారం
మీ అభిమానానికి కృతఙ్ఞతలు
పద్మనాభం దూర్వాసుల గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment