Wednesday, January 9, 2008

తెలుగు భాషాభిమానుల ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు గ్రీటింగ్స్ సైట్ నుండి 1553( అక్షరాలా పదిహేను వందల ఏభై మూడు) శుభాకాంక్షల సందేశాలు పంపబడినాయని తెలుపుటకు సంతోషిస్తున్నా. తెలుగుభాషాభిమానుల ఉత్సాహానికి జోహర్లు. ఈ అదరాభిమానాలకు కృతఙ్ఞతలు. అభిప్రాయవేదిక ద్వారా ప్రోత్సాహమిస్తున్న సహృదయులకు ధన్యవాదములు.

మీ సలహాలు, సూచనలు పంపి తెలుగు గ్రీటింగ్స్ సైట్ ని ఇంకా, ఇంకా తీర్చిదిద్దడానికి తోడ్పడమని కోరుకుంటున్నాను.


- దూర్వాసుల పద్మనాభం

4 comments:

కొత్త పాళీ said...

మీ గురించీ, మీ సైటు గురించీ బ్లాగరుల సమావేశాపు నివేదికల్లో ఇదివరకే వినివున్నా, సైటుని చూడటం ఇప్పుడే. గ్రీటింగులు, వాటిల్లోని సందేశాలు బాగున్నాయి. నూతన సంవత్సర వేడుక సందర్భంగా సైటు సాధించిన ప్రగతికి అభినందనలు

పద్మనాభం దూర్వాసుల said...

కొత్తపాళీ గారూ ధన్యవాదములు
-పద్మనాభం

వర్మ said...

పద్మనాభంగారు మీరు చేస్తున్న ఈ కృషికి అభినందనలు. మీబ్లాగు తెలుగు యువతకు మంచి స్పూర్తిదాయకం. మీనుంచి మరిన్ని సందేశాలుతో పాటు మంచి గ్రీటింగ్స్ కోరుకుంటున్నాను .
అభిమానంతో వర్మ.

పద్మనాభం దూర్వాసుల said...

వర్మగారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు.
నా ప్రయత్నం అదే.సహృదయుల సలహాలు, సూచనలు నాకు సదా శిరోధార్యం
పద్మనాభం