Saturday, December 13, 2008

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు



తెలుగు బ్లాగుల దినోత్సవ సందర్భంగా మీ అభిమానులకు శుభాకాంక్షలు పంపటానికి "తెలుగు గ్రీటింగ్స్" సైటులో క్రొత్త కేటగిరీ ప్రారంభించాను.
మీరు క్రింది లింకునుండి శుభాకాంక్షలు పంపగలరు:

http://www.telugugreetings.net/blogday.htm


తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
దూర్వాసుల పద్మనాభం

3 comments:

devi said...

పద్మ నాభం గారు ముందు గా ధన్య వాదాలు.నా బ్లాగు చూసి మీ అభిప్రాయా లను తెలిపినందుకు.

మీరు పంపిన లింకును చాసాను గ్రీటింగ్స్ చాలా
బావున్నయి.మన తెలుగు దనం ఉట్టి పడేలా వున్నాయి.
వేమన పద్యాలు చాలా చాలా బావున్నాయి.

దేవి...

Anonymous said...

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

Bolloju Baba said...

పెద్దలు పద్మనాభం గారికి మీ గ్రీటింగుల సైటు చూసాను. చాలా బాగుందండీ ఈ క్రింద కొన్ని గ్రీటిగులపై వ్రాసే శుభాకాంక్షలను ఇస్తున్నాను. మీకు నచ్చినట్లయితే వాడుకొనవచ్చును. (ఇవి వెబ్బులో దొరికిన కొన్ని గ్రీటింగులపై నున్న అనువాదములే- నా స్వంతం కావు)

1. నీవు స్వప్నించాలనుకొన్న ప్రపంచాలను స్వప్నించు
నీవు ప్రయాణించాలనుకొన్న దూరాలను సాగించు.
నీవెలా ఉండాలనుకొన్నావో అలానే ఆవిష్కరించుకో
ఎందుకంటే
నీ చేతిలో ఉన్నది ఒక్క జీవితమే
నీవు ఏపని చేయాలనుకొన్నా
ఉన్నది ఒక్క అవకాసం మాత్రమే.

2. రాబోయే సంవత్సరంలో నీ కలలన్నీ
నిజంకావాలని ............

3. శుభాశీస్సుల కవాతు
నిన్ను వెతుక్కూంటూ వస్తున్నది.



4. ఒక నూతన సంవత్సరం విచ్చుకొంటూంది-- ఇంకా పూర్తిగా విచ్చుకోని రేకల వెనుక సౌందర్యాన్ని దాచుకొన్న కుసుమంలా.

5. ఓ పుస్తకాన్ని మనం తెరుస్తాం.
దానిపై కొన్ని మాటల్ని వ్రాసుకుంటాం.
ఆ పుస్తకం పేరు అవకాసము.
దాని మొదటి పేజీ నూతన సంవత్సర దినం

6.మరొక కొత్త సంవత్సరం మనముందుంది
మరొక సంవత్సర ఆనందం తెచ్చింది.
బాధల్నీ, భయాల్నీ, అనుమానాల్నీ విడనాడి
ప్రేమించుకుందాం, ఆనందిద్దాం, పంచుకుందాం.

7. ఈ కొత్తసంవత్సరాన్ని ఈశ్వరుడు మనకు ప్రసాదించాడు.
ప్రతీదినమూ నూత్నోత్సాహంతో జీవించటానికై
ఎత్తులకు ఎదుగుతూ, ఉత్తమంగా ఉండటానికై.

8. మరో అవకాసం వచ్చింది.
తప్పులను సరిదిద్దుకోవటానికై
శాంతిని పెంపొందించుకోవటానికై
ఒక సంతోష తరువుని నాటటానికై
మరిన్ని ఆనందగీతాల్ని ఆలపించటానికై.


9. రాత్రి 12 గంటలకు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం
వెలుగులు చిమ్మే బాణాసంచా కాంతులలో
పాత సంవత్సరానికి ముద్దులతో వీడ్కోలు పలికి
కొత్త సంవత్సరాన్ని సాదరంగా పిలుద్దాం


10. విషాదం రేపటి బాధల్ని తగ్గించలేదు.
నేటి ఆనందాల్ని మింగేస్తుంది.
మిత్రమా,
నీ బాధల్ని తరిమికొట్టే
నూతన సంవత్సరాన్ని కాంతులతో
సంగీతంతో అహ్వానిద్దాం రా.

11. ఈ నూతన సంవత్సర దినాన.
నీ ప్రేమ నీడలో ఊయలలూగుతూ
నీ పెదవుల మృధుత్వాన్ని స్పర్శిస్తూ
నిన్ను నా హృదయానికి దగ్గరగా తీసుకొంటూ
నీ సమక్షంలో నేను ఒక అనంత స్వప్నాన్ని
స్వప్నిస్తున్నాను,


13 నీ కొరకై నా ఆకాంక్ష.

ఈ నూతన సంవత్సర దినాన నీ కోసం నేను కోరే కోర్కెలు.

నీ హృదయంలో శాంతి
కుటుంబము, మిత్రుల నుండి ప్రేమ
నీ మార్గాన్ని నడిపించే విశ్వాసం నిరంతరమూ వెన్నాడే ఆశ
రోజుల్ని వెలిగించే సూర్యకాంతి
దైవలోకపు తారల అనుగ్రహం.
రేపున్నదని తెలిపే ఇంద్రధనస్సులు.
కరుణను పలికించే కన్నీటి చుక్కా
ప్రేమను నింపుకొనే హృదయం

అన్నింటినీ మించి
నీచేయిలో నాచేతి స్పర్శా

నీవు తడబడినపుడు,
నీకు ఆనందం అందించటానికి
ప్రేమనందించటానికి,
నాతో పంచుకొన్న నీ స్నేహపు మధురిమల్ని
తిరిగి ఇవ్వటానికి నేనున్నాను అనే జ్ఞానం

సదా నీవెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ


14. ఈ కొత్త సంవత్సరం
నీవు నడిచిన అన్ని సంవత్సరాలలో కెల్లా
ఉత్తమమైనది గా ఉండాలనీ
ప్రతీ క్షణం గతించిన ఘడియ కన్నా మెరుగ్గా సాగాలనీ
నీ తీయని స్వప్నాలు ఫలించాలనీ
ప్రతి దీవననూ గుర్తించి, ఆనందించగలిగే
అవకాసం కలగాలనీ
ఆకాంక్షిస్తున్నాను.

15. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మరెన్నో.


16. నీకివే నా శుభాకాంక్షలు
నూతన ఆశయాలు గుభాళించే క్షణాలు అన్నీ ఫలించాలి నీ ప్రతీ నడకలో
నూతన సంవత్సర శుభాకాంక్షలu



17. ఈ కొత్త సంవత్సరపు ప్రతీరోజూ
అష్టైశ్వరపు దీప కాంతులలో ప్రకాశించాలని
ఆకాంక్షిస్తూ

18. నూతన సంవత్సరపు ఈ పచ్చని క్షణాన
ఆకుల వర్ణాలు భువంతా పరచుకోనీ.

19. కొత్త ప్రమాణాలు,
కొత్త వాగ్ధానాలు
కొత్త నిర్ణయాలు


20. అరవిరిసిన సుమాల అద్భుత స్ఫూర్తితో
నూతన సంవత్సర శుభాకాంక్షలు




21. మేల్కొను, ఉదయించు, ఒక కొత్త ప్రపంచంలోకి
ఐశ్వర్యాలు ఆనందాలూ వర్షించనీ.

22. నీ భవిష్య దినాలలో శాంతి పల్లవించుగాక!

23. మన స్నేహం ఒక గులాబీ వంటిది.

మృధురేకల క్షణాలేన్నో
ఈ సమయంలో గుభాళిస్తున్నాయి.
ఒకటే తేడా, గులాబీ వాడిపోతుంది.

24. జీవించటానికి వేడుక చేయ్ లేదా వేడుక కోసమే జీవించు.

25. నా మిత్రులకూ, వారి మిత్రులకూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.


26. ఈ సంవత్సరం
జీవనాద్భుతాలను ఆస్వాదించే అదృష్టం కలుగుతుందని
ఆశిస్తూ


27. మార్గాన్ని కాంతిమయం చేస్తున్న కొత్త సంవత్సరానికి
ఆహ్వానం

భవదీయుడు

బొల్లోజు బాబా