Thursday, December 18, 2008

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగు స్టాలు

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగుకి ఓ స్టాలు ప్రత్యేకంగా తీసుకోబడింది.
పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు
కాబట్టి,దీని వలన అంతర్ఝాలంలో తెలుగు వ్యాప్తికి చేస్తున్న కృషికి మరింత చేయూత వస్తుందనడంలో సందేహం లేదు.అయితే, ఈ స్టాలు నిర్వహణకి సంబంధించి ఔత్సాహికులు కావాలి.

స్టాలు ప్రదర్శన నడిచిన రోజులు అనగా 19-12-2008( శుక్రవారం) నుండి
28-12-2008 (ఆదివారం)వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటలవరకు స్టాలు నడుపుటకు ప్రతిరోజూ కనీసం నలుగురు ఉంటే బాగుంటుంది.


ముఖ్యంగా శని మరియు ఆదివారాలు కాక వారంలోని మిగతా రోజులలో అక్కడ పైన చెప్పిన సమయంలో ఉండటానికి ఔత్సాహికులు కావాలి.అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ తెలుగు బ్లాగుల గుంపులో కాని, etelugu.org లో గాని, ఇక్కడ కాని స్పందించండి. ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి. మీ సహాయం మరియు తోడ్పాటు ఈ-తెలుగుకి ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. ఇది మనకు వచ్చిన మొట్టమొదటి పెద్ద అవకాశం.దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం మొట్టమొడటి సారిగా ప్రజల ముందు మన కార్యక్రమాలను ఉంచుతున్నాం.కనుక ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చెయ్యాలి

1 comment:

Bolloju Baba said...

పెద్దలు, పద్మనాభంగారికి,
నమస్కారములు.
మీ సైటులో ఈ క్రింద లింకులో నేనొక కామెంటు చేసాను. గమనించగలరు.

https://www.blogger.com/comment.g?blogID=4957102247029647276&postID=1439961099892139665